ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం 'ఆత్మ నిర్భర్ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్' ప్రారంభించనున్నారు. స్థానిక వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూర్షిప్)ను ప్రోత్సహించడం, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యం.
కరోనా సంక్షోభం కారణంగా వలసకార్మికులు, శ్రామికులు ఉపాధి కోల్పోయి.. చాలా అవస్థలు పడుతున్నారు. అందువల్ల వారికి ప్రాథమిక సౌకర్యాలు, జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం... 'యూపీ ఉపాధి స్వావలంబన ప్రచారం' ప్రారంభించింది. స్థానిక ఎంట్రప్రెన్యూర్స్‌ని ప్రోత్సహించడం; పరిశ్రమలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచి, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
ఉపాధి కల్పన
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి.. సుమారు 30 లక్షల మంది వలస కార్మికులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ ఇళ్లకు తిరిగివచ్చారు. అలాగే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 25 వేలకు పైగా ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు.
మోదీ మాట
శుక్రవారం ఉదయం నిర్వహించనున్న వర్చువల్ లాంఛ్‌లో... ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఆరు జిల్లాల గ్రామస్థులతో మాట్లాడనున్నారు. కామన్ సర్వీస్ సెంటర్లు, కృష్ణ విజ్ఞాన కేంద్రాల ద్వారా.... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్