ETV Bharat / bharat

లాక్​డౌన్ పొడిగింపుపై రేపు మోదీ ప్రకటన!

ఆంక్షలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతుండటం, ఇందుకు అఖిల పక్ష నేతల్లో మెజారిటీ సభ్యులు అంగీకరించటం వల్ల లాక్​డౌన్ కొనసాగింపు లాంఛనమే కానుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. అప్పుడే లాక్​డౌన్​ పొడిగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

MODI
ప్రధాని మోదీ
author img

By

Published : Apr 10, 2020, 5:09 PM IST

Updated : Apr 10, 2020, 5:23 PM IST

లాక్​డౌన్ కొనసాగింపుపై కేంద్రం కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే అఖిల పక్ష నేతలతో చర్చించిన ప్రధాని నరేంద్రమోదీ.. శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే లాక్​డౌన్ కొనసాగింపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం మోదీ ప్రసంగం!

ముఖ్యమంత్రులతో భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పరోక్షంగా సూచనలు చేశాయి. అయితే ఈ సారి ఎన్నో మార్పులు చేస్తారని తెలుస్తోంది.

కొన్ని సడలింపులు..

నిత్యావసరాల రవాణా మినహాయించి రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. పాఠశాలలు, కళాశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మూసే ఉంచుతారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తూ కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.

ఇటీవల అఖిల పక్ష నేతలతో మోదీ చర్చించిన నేపథ్యంలో 88 శాతం మంది నాయకులు లాక్​డౌన్ కొనసాగింపునకు మొగ్గు చూపినట్లు సమాచారం. మోదీ కూడా ఏప్రిల్ 14 తర్వాత.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా లాక్​డౌన్ ఎత్తివేసే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఒడిశా, పంజాబ్​లో ఇప్పటికే...

కరోనా వ్యాప్తిని పూర్తిగా నివారించేందుకు లాక్​డౌన్ కొనసాగించాలని అన్ని జిల్లాల పాలనాధికారులు, నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ఆంక్షలు ఇంకా కొనసాగించాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక సహా అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ ప్రభుత్వాలు ఏప్రిల్ 30 వరకు లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.

ఇదీ చూడండి: దేశంలో కరోనా సామాజిక వ్యాప్తికి అవకాశం

Last Updated : Apr 10, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.