ETV Bharat / bharat

లాక్​డౌన్ సమయంలో విద్యార్థుల కోసం వెబ్​సైట్​

కరోనా కారణంగా లాక్​డౌన్​తో ఇళ్లు, హాస్టళ్లలో ఉంటున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు సహకారం అందించే వెబ్​సైట్​ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్​ ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందించే దిశగా పనిచేసే ఈ వెబ్​సైట్ అడ్రెస్ https://helpline.aicte-india.org . దీనిద్వారా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి.

pokriyal
కరోనా వేళ.. విద్యార్థుల అనుసంధానికి వెబ్​సైట్
author img

By

Published : Apr 4, 2020, 4:44 PM IST

ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు సమాజంలోని అట్టడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా నష్టపోతుంటాయి. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వర్గంగా చెప్పుకునే యువత ముఖ్యంగా కళాశాల విద్యార్థులు మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి సాయమందించే దిశగా ఓ వెబ్​సైట్​ను ప్రారంభించారు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్​. https://helpline.aicte-india.org వెబ్ అడ్రెస్ ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన సహకారాన్ని పొందొచ్చు.

వెబ్​సైట్ లక్ష్యం

లాక్​డౌన్ కారణంగా చాలామంది హాస్టళ్లలోనే ఉండిపోయారు. అద్దె ఇళ్లలో, వసతి గృహాల్లో నివాసం ఉంటున్నారు. వారికి సహకరించడమే ఈ వెబ్​సైట్ లక్ష్యం. ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను కుటుంబం, పాఠశాలలు, కళాశాలలతో అనుసంధానించడం.. మానసిక, అత్యవసరమైన వ్యక్తిగత అవసరాలను తీర్చడం లక్ష్యాలుగా ఈ వెబ్​సైట్ పనిచేస్తుంది.

ఏఐసీటీఈ చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్, గ్రాఫిక్ ఎరా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్న్ విద్యార్థులు శివాన్షు, ఆకాష్‌లు ఈ వెబ్‌సైట్‌ను ఏప్రిల్ 3న ఒకే ఒక్క రోజు వ్యవధితో రికార్డు సమయంలో ప్రారంభించారు.

సదుపాయాలివే..

వసతి, ఆహారం, ఆన్‌లైన్ తరగతులు, మార్గదర్శకత్వం, పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు, ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్యం, రవాణా, ఇతర అంశాలకు సంబంధించి ఈ వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని, సహకారాన్ని పొందవచ్చు. ఇందుకోసం 6,500కి పైగా కళాశాలలు ఇప్పటికే తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చాయి.

కరోనా సంక్షోభ సమయంలో రేపటి పౌరులను పోషించడానికి ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థలు, సామాజిక, సహకార సంస్థలు, దాతలను ఇందులో పాల్గొనాలని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఏఐసీటీఈ, ఎంహెచ్​ఆర్​డీ జాతీయ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్‌ను cconeat@aicte-india.org ద్వారా సంప్రదించగలరు.

ఇదీ చూడండి: 'వైరస్ పరీక్షలు పెరిగితేనే లాక్​డౌన్​తో ప్రయోజనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.