ETV Bharat / bharat

ప్రపంచంలోని టాప్​-20 పెట్టుబడిదారులతో మోదీ భేటీ - PM MODI MEET WITH INVESTERS

నేడు జరగనున్న వర్చువల్​ గ్లోబల్​ ఇన్వెస్టర్​ రౌండ్​ టేబుల్​ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రపంచంలోని టాప్​ 20 సంస్థాగత పెట్టుబడిదారులతో భేటీ కానున్నారు.

PM narendra modi to chair global investor roundtable meeting on Thursday
ప్రపంచస్థాయి పెట్టుబడిదారులతో మోదీ సమావేశం
author img

By

Published : Nov 5, 2020, 5:24 AM IST

దేశంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ జరిగే వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రపంచంలోని టాప్‌ 20 సంస్థాగత పెట్టుబడిదారులతో ప్రధాని భేటీ కానున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారులైన సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌ సహా అమెరికా, ఐరోపా, కెనడా, కొరియా, జపాన్‌, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థాగత పెట్టుబడిదారులు ఇందులో పాల్గొననున్నారు. వీటి ఆధీనంలో సుమారు 6 ట్రిలియన్ డాలర్ల నిధుల ఉన్నాయి. వీజీఐఆర్​- 2020లో ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చటం, ఆర్థిక విధానాలు, సంస్కరణలు, పెట్టుబడులకు అవకాశాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, నందన్‌ నిలేఖనీ, దిలీప్ సంఘ్వీ,ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: 'మంచి పాలనకే బిహార్​ ప్రజలు ఓటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.