చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండింగ్‌లో సమస్య అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తెల్లవారుజామున విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత.. బెంగళూరు ఇస్రో కేంద్రంలోనే ఉన్న మోదీ వారికి ధైర్యం చెప్పారు. 'దేశం మీ వెంటే ఉంటుందని... మీరు మరింత గొప్ప కృషి చేయాలని' ప్రోత్సహించారు.
శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత.. మోదీ బయటకు వచ్చే క్రమంలో ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అది చూసిన మోదీ దగ్గరికెళ్లి... ఆలింగనం చేసుకొని ఓదార్చారు. యావత్ దేశం శాస్త్రవేత్తల వెంటే ఉంటుందని ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.