ETV Bharat / bharat

'ఒకే లక్ష్యం.. ఒకే సంకల్పం.. అదే కరోనాపై విజయం' - జేపీ నడ్డా

భాజపా 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు సందేశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా తీవ్రతను దేశ ప్రజలంతా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. కొవిడ్​ను అంతమొందించేందుకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ఆపద సమయంలో.. ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఆరోగ్య సేతు యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకోవాలని అభ్యర్థించారు ప్రధాని.

PM Modi's message on BJP's 40th foundation day
'ఒకే లక్ష్యం.. ఒకే సంకల్పం.. అదే కరోనాపై విజయం'
author img

By

Published : Apr 6, 2020, 12:36 PM IST

కరోనాను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్​ కట్టడికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్న ఆయన.. అన్ని రాష్ట్రాల సహకారం వల్లే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. భాజపా 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలంతా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు ప్రధాని.

''కరోనాను తరిమికొట్టేందుకు అందరం ఒక్కటవుదాం. అంతిమయుద్దంలో విజయం మనదే. 130 కోట్ల మంది ప్రజలు.. పరిణతితో వ్యవహరించారు. నిన్న రాత్రి 9 గంటలకు అది స్పష్టంగా కనిపించింది. క్లిష్ట సమయాల్లో ఎలా మెలగాలో ప్రపంచదేశాలకు భారత్​ ఆదర్శంగా నిలిచింది. భారత్​ తీసుకుంటున్న చర్యలను డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసించింది. లాక్​డౌన్​ సమయంలో ప్రజలంతా సహకరించాలి.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి

భారత్​ సహా ప్రపంచమంతా కష్టకాలంలో ఉన్నప్పుడు భాజపా ఈ సారి వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు మోదీ.

కరోనా వైరస్​ మహమ్మారిపై సుదీర్ఘ యుద్ధం చేయాల్సి ఉందన్నారు ప్రధాని. విశ్రాంతి లేకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశానికి ప్రస్తుతం ఒకే లక్ష్యం-ఒకే సంకల్పం ఉందని.. అది కరోనాపై విజయం సాధించడమేనన్నారు.

మోదీ సూచనలు..

  • ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకోండి. ఒక్కొక్కరు మరో 40 మందిని అలా చేయమని ప్రోత్సహించండి. మీ చుట్టుపక్కల కరోనా కేసుల గురించి ఇందులో సమాచారం ఉంటుంది.
  • సామాజిక దూరం, క్రమశిక్షణ పాటించండి.
  • ఇంటాబయట ఫేస్​ మాస్కులు ధరించండి.
  • గతంలో యుద్ధసమయాల్లో మన తల్లులు, చెల్లెలు బంగారం విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. కానీ ఇది మానవత్వాన్ని కాపాడే యుద్దం. ఈ సందర్భంగా ప్రతి భాజపా కార్యకర్త.. పీఎం కేర్స్​ నిధికి విరాళాలు ఇవ్వమని అభ్యర్థిస్తున్నా. ఇలా చేసేలా మరో 40 మందిని ప్రోత్సహించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.