ETV Bharat / bharat

'ఇట్లు.. మీ అన్నయ్య ప్రధాని నరేంద్ర మోదీ' - PM Modi's letter to Deepa

ఉత్తరాఖండ్ కు చెందిన ఓ సోదరికి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. రాఖీ పౌర్ణమి రోజున తనకోసం ప్రత్యేక రాఖీ పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ ఉత్తరానికి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో లైకులు వెల్లువెత్తాయి.

PM Modi's letter of thanks to Uttarakhand woman who sent him rakhi
'ఇట్లు.. మీ అన్నయ్య ప్రధాని నరేంద్ర మోదీ'
author img

By

Published : Sep 12, 2020, 11:16 AM IST

తన రక్ష కోరుతూ.. రాఖీ పంపిన ఓ సోదరికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఉత్తరాఖండ్, రుద్రపుర్ కు చెందిన దీప మటేలా.. జులై 28న స్పీడ్ పోస్టు ద్వారా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి సింగ్ రావత్ లకు ప్రత్యేక ఆయిపన్ డిజైన్ రాఖీలు పంపారు. ఆ రాఖీ అందిన వెంటనే.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోదర భావంతో ప్రేమను పంచుకున్న దీపకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.

ప్రధాని కార్యాలయం నుంచి లేఖ అందుకున్న దీప సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఉత్తరాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

PM Modi's letter of thanks to Uttarakhand woman who sent him rakhi
'ఇట్లు.. మీ అన్నయ్య ప్రధాని నరేంద్ర మోదీ'

"అన్నా-చెల్లెల్లు ఒకరికొరు రక్షగా ఉండాలని తెలిపే భారత సంస్కృతి ఎంతో గొప్పది. రక్షా బంధన్ పండుగ మన మధ్య ఆప్యాయతను పెంచుతోంది. ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటున్నా. ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండాలని కరోనా మనకు నేర్పుతోంది."

-ప్రధాని మోదీ లేఖ సారాంశం.

ఇదీ చదవండి: లక్షలు నిండిన బ్యాగు దొరికితే.. తిరిగిచ్చేసిన ఆటోడ్రైవర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.