ETV Bharat / bharat

ట్రంప్​కు మోదీ ఫోన్​- కరోనాపై కీలక చర్చ

author img

By

Published : Apr 4, 2020, 8:09 PM IST

Updated : Apr 4, 2020, 8:40 PM IST

కరోనా వైరస్​పై కలిసి పోరాడేందుకు భారత్-అమెరికా చేతులు కలిపాయి. రెండు దేశాల పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలతో వైరస్​ను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

PM Modi, US President Donald Trump have telephonic conversation
కరోనాపై ట్రంప్, మోదీ ఉమ్మడి పోరుకు నిర్ణయం

అమెరికా సహా భారత్​లోనూ కరోనా విశ్వరూపం చూపిస్తున్న నేపథ్యంలో ఇరుదేశాధినేతలు ఒక్కతాటిపైకి చేరారు. రెండు దేశాలు సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని తీర్మానించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​లో సంభాషించుకున్నారు.

ఈ విషయన్ని ప్రధాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ఫోన్​లో విస్తృత చర్చలు జరిగాయి. కరోనా వైరస్​పై పోరాడేందుకు భారత్-అమెరికా భాగస్వామ్య పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి అంగీకరించాం."-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

భారత్​లో వైరస్ కేసులు ఇప్పుడిప్పుడే తీవ్రమవుతుండగా.. అమెరికాలో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. ప్రపంచంలో అత్యధిక కేసులు ఆ దేశంలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 2,78,458 పాజిటివ్ కేసులు నిర్ధరించారు అధికారులు. 7100 మందికి పైగా వైరస్ ధాటికి బలయ్యారు.

Last Updated : Apr 4, 2020, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.