దేశ నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు ప్రధాని భూమి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒంటిగంటకు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సర్వ ధర్మ ప్రార్థనను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర మంత్రులు, పలు దేశాల రాయబారులు పాల్గొంటారు. రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు వర్చువల్‌గా హాజరవుతారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
కొత్త భవనం అందుకే..
ప్రస్తుత పార్లమెంట్ భవనం వందేళ్లు పూర్తి చేసుకుంటున్నందున.. కొత్త భవన నిర్మాణం తలపెట్టినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల చెప్పారు. దేశ విభిన్నతను చాటిచెప్పేలా నిర్మించే ఈ నిర్మాణాన్ని 2022 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చూడండి:దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా నూతన పార్లమెంటు భవన నిర్మాణం