ETV Bharat / bharat

టీకాపై అపోహలు తొలగించండి: మోదీ - మోదీ న్యూస్

కొవిడ్​ టీకా పొందిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. టీకాపై అపోహలను తొలగించాలని వైద్య సిబ్బందిని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్​లో కొనసాగుతోందన్న ఆయన.. వాక్సిన్​ రూపొందించటం వల్ల దేశం.. ఆత్మనిర్భరత సాధించిందని తెలిపారు.

PM Modi to interact with beneficiaries, vaccinators of COVID-19 inoculation drive in Varanasi
'ఆ విషయంలో మనం ఆత్మనిర్భర్​ భారత్​ను సాధించాం'
author img

By

Published : Jan 22, 2021, 1:52 PM IST

Updated : Jan 22, 2021, 3:32 PM IST

వ్యాక్సిన్​ భద్రతపై ఉన్న భయాలు, అపోహలను తొలగించాలని వైద్య నిపుణులకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది 'క్లీన్ చిట్' ఇస్తే టీకా భద్రతపై ప్రజలకు బలమైన సందేశం అందుతుందని అన్నారు.

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని వైద్య సేవల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన... వ్యాక్సిన్ స్వీకరించినవారి అనుభవాలను తెలుసుకున్నారు. తమకు ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని టీకా తీసుకున్న సిబ్బంది స్పష్టం చేశారు.

వైరస్​పై పోరులో కరోనా యోధులు అద్భుతంగా పనిచేశారని ప్రధాని మోదీ కొనియాడారు. స్వయంకృషితో కరోనా వ్యాక్సిన్ రూపొందించుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో దేశం ఆత్మనిర్భర్ భారత్​గా ఎదిగిందని అన్నారు.

కరోనా టీకా స్వీకరించేందుకు కొంతమంది వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశం నిర్వహించడం గమనార్హం. తమకు కేటాయించిన సెంటర్లకు చాలా మంది సిబ్బంది గైర్హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు.

Last Updated : Jan 22, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.