ETV Bharat / bharat

అటల్​ సొరంగాన్ని ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపొడవైన సొరంగ మార్గం 'అటల్​ టన్నెల్'​ను జాతికి అంకితమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​, త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, హిమాచల్​ ప్రదేశ్​ సీఎం పాల్గొన్నారు.

PM Modi inaugurates Atal Tunnel
అటల్​ సొరంగాన్ని ప్రారంభించిన మోదీ
author img

By

Published : Oct 3, 2020, 11:07 AM IST

Updated : Oct 3, 2020, 11:45 AM IST

అటల్​ సొరంగాన్ని ప్రారంభించిన మోదీ

హిమాచల్​ప్రదేశ్​లో మనాలి నుంచి లేహ్​ వరకు నిర్మించిన కీలక అటల్​ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుని.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో 9.2 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించింది.

ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్​, త్రిదళాదిపతి జనరల్​ బిపిన్​ రావత్​, సైన్యాధిపతి జనరల్​ ఎంఎం నరవాణే సహా పలువురు పాల్గొన్నారు.

ప్రత్యేకతలెన్నో..

ఈ సొరంగంతో మనాలి- లేహ్‌ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంతేకాదు దాదాపు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఇది కీలకం కానుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించారు.

ఏడాది పొడవునా అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకుని దీటుగా నిలబడే ఈ సొరంగ మార్గం.. మనాలిని లేహ్​లోని లాహౌల్​-స్పితి లోయతో అనుసంధానం చేస్తుంది. ఈ టన్నెల్​ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వినియోగించారు. హిమాలయాల్లోని పీర్​ పంజాల్​ పర్వతశ్రేణిలో 3వేల మీటర్లు.. అంటే సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ నెలవై ఉంది. ఈ సొరంగ మార్గం దక్షిణ ద్వారం.. మనాలికి 25 కిలో మీటర్ల దూరంలో ఉండగా.. ఉత్తర ద్వారం.. లాహౌల్​ లోయలోని తెలింగ్​ గ్రామం వద్ద ఉంది.

ఇదీ చూడండి: అద్భుత నిర్మాణం అటల్​ టన్నెల్ ప్రత్యేకతలివే..

Last Updated : Oct 3, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.