ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
"గురునానక్ దేవ్‌జీ ఆశీర్వాదంతో కర్తార్‌పూర్ సాహిబ్‌ను స్వేచ్ఛగా దర్శించుకునే కల నిజం కాబోతుంది. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న ఈ కారిడార్‌ను ప్రారంభిస్తారు."- హర్ సిమ్రత్ కౌర్ బాదల్, కేంద్రమంత్రి ట్వీట్
'కారిడార్ ప్రారంభం తరువాత ప్రధాని సుల్తాన్పూర్ లోధీ వద్ద ప్రార్ధనలు చేస్తారు. నవంబర్ 11న హోంమంత్రి అమిత్‌షా శిరోమణి గురుద్వారా పర్బంధక్ను సందర్శిస్తారు. నవంబర్ 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎస్‌జీపీసీని దర్శించనున్నారని' హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు.
తేదీ ఖరారు కాలేదు..
కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభ తేదీని ఇంకా నిర్ణయించలేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నిర్ణయం మేరకు కారిడార్ ప్రారంభ తేదీ నిర్ణయిస్తామని పాక్ విదేశాంగమంత్రి అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ తెలిపారు. అయితే ఈ కారిడార్ నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ మందిరాన్ని పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలుపుతూ నిర్మిస్తున్నదే కర్తార్‌పూర్ నడవా. ఇది పూర్తయితే వీసా లేకుండానే ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర ప్రదేశాలను దర్శించుకోగలుగుతారు.
ఇదీ చూడండి: ఒకే కాన్పులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్ల పులి..!