ప్రధానిగా రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం తొలిసారి లోక్సభ, రాజ్యసభ సభ్యులతో భేటీ కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు పార్లమెంట్ సభ్యులందరికీ విందు ఇవ్వనున్నారు.
దిల్లీలోని హోటల్ అశోకలో విందు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఎంపీలందరికీ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆహ్వానం పంపించినట్లు తెలిపారు.
జమిలి ఎన్నికల నిర్వహణ కోసం అఖిల పక్షాలతో బుధవారం భేటీ అయ్యారు మోదీ. ఇదే సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
ఇదీ చూడండి: 'కమిటీ ద్వారా ముందుకు' - జమిలిపై కేంద్రం