'గ్రాండ్ ఛాలెంజెస్' వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 19 నుంచి 21 వరకు జరిగే ఈ సదస్సును కరోనా నేపథ్యంలో వర్చువల్గా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తారు.
అంతర్జాతీయ ఆవిష్కరణలతో ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న అతిపెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు.. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం గత 15ఏళ్లుగా సహకారం అందిస్తోందని ప్రధాని కార్యాలయం తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో.. విధానకర్తలు, శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కానున్నారు.
ఈ వార్షిక సమావేశాన్ని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, శాస్త్ర సాంకేతిక శాఖ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, గ్రాండ్ ఛాలెంజెస్ కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అండ్ వెల్కం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోనా అనంతరం సుస్థిర అభివృద్ధి సాధించేందుకు అవసరమైన కీలక అంశాల గురించి ఈ వేదికపై చర్చించనున్నారు. ఇందుకు 40 దేశాలకు చెందిన 1600 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.