ETV Bharat / bharat

'గేట్స్​' పురస్కారంతో మోదీకి సత్కారం- కారణమిదే

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్​ అభియాన్'​కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వినూత్న ఆలోచనకు బిల్​ అండ్​ మిలిందా గేట్స్​ పురస్కారం వరించింది.

స్వచ్ఛభారత్​కు మరో గుర్తింపు-మోదీకి 'గేట్స్​'పురష్కారం
author img

By

Published : Sep 17, 2019, 11:11 PM IST

Updated : Oct 1, 2019, 12:21 AM IST

దేశాన్ని పచ్చదనం-పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛభారత్​ కార్యక్రమానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2019వ సంవత్సరానికి వ్యాపారవేత్త బిల్​గేట్స్ నేతృత్వంలోని బిల్​ అండ్ మిలిందా గేట్స్​ ఫౌండేషన్​ 'గ్లోబల్ గోల్ కీపర్' అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్​ 24న అమెరికాలో ఈ అవార్డును స్వీకరించనున్నారు మోదీ.

అంతర్జాతీయ సమాజ లక్ష్యాలను చేరుకునేందుకు తమ దేశం, ప్రపంచ స్థాయిలో అంకితభావం, సమర్థతతో ప్రభావశీలంగా పనిచేసే నేతలకు ఏటా గ్లోబల్​ గోల్​ కీపర్​ పేరుతో అవార్డు అందిస్తుంది బిల్ అండ్ మిలిందా గేట్స్​ ఫౌండేషన్. స్వచ్ఛభారత్​పై చేసిన కృషికి ఈ ఏడాది మోదీని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఈ అవార్డు అందించే గ్లోబల్​ బిజినెస్​ ఫారం వేదికగా అంతర్జాతీయ నేతలు, కార్పొరేట్​ దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ.

ఈ అవార్డులు.. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల గురించి తెలియజేస్తాయని బిల్​ అండ్​ మిలిందా గేట్స్​ ఫౌండేషన్స్​ తెలిపింది. ప్రపంచంలో ఉన్న అసమానతలపై పోరాడటానికి 'గోల్​ కీపర్స్'​ కృషి చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

2014 అక్టోబరు 2న స్వచ్ఛభారత్​ను ప్రారంభించారు ప్రధాని. 150వ గాంధీ జయంతి(ఈ ఏడాది) నాటికి దేశంలో పారిశుద్యాన్ని పెంపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దేశంలో బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు ఇప్పటివరకు 90 మిలియన్ల మరుగుదొడ్లు నిర్మించింది కేంద్రం.

ఇంతకుముందు సంవత్సరాల్లో జరిగిన గోల్​ కీపర్స్​ కార్యక్రమాల్లో ప్రసంగించిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా, ఫ్రెంచ్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​, యూఎన్​ డిప్యూటీ సెక్రటరీ జనరల్​ అమీనా మహమ్మద్​, నోబెల్​ శాంతి బహుమతి విజేతలు మలలా యూసఫ్​జాయ్​, నాడియా మురాద్​ ఉన్నారు.

ఇదీ చూడండి:'నిర్మానుష ప్రదేశాల ద్వారా ఉగ్రవాదుల చొరబాటు'

New Delhi, Sep 17 (ANI): While addressing a press conference, after completing first 100 days of his ministry in the national capital, External Affairs Minister S Jaishankar said, "The diaspora is, of course, the forte and in many ways somewhat unique aspect of our foreign policy and that is underlined by what is going to be coming up very soon in the United States which is a big diaspora event in partnership with our Indian-American community."
Last Updated : Oct 1, 2019, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.