మంగళవారం ప్రారంభమయ్యే 12వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాననమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో మోదీ వర్చువల్‌గా పాల్గొంటారని తెలిపింది. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం, కరోనా నియంత్రించే మార్గాలపై ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాధినేతలు చర్చించనున్నట్లు పేర్కొంది.
ఈ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనరొ వర్చువల్‌గా పాల్గొంటారు. బ్రిక్స్ దేశాల కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి.
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న తరుణంలో ఇరు దేశాల అగ్రనేతలు ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:- 2024లో గెలుపే లక్ష్యంగా నడ్డా దేశవ్యాప్త పర్యటన!