ETV Bharat / bharat

ఐరాస వార్షిక సమావేశంలో నేడు మోదీ ప్రసంగం - modi to address united nations meeting

ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో నేడు ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొవిడ్ నేపథ్యంలో ప్రపంచదేశాల మధ్య ఉండాల్సిన సహకారంపై మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం.

pm modi to address united nations meeting
ఐరాస వార్షిక సమావేశంలో నేడు మోదీ ప్రసంగం
author img

By

Published : Jul 17, 2020, 5:07 AM IST

ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం జరగనున్న అత్యున్నతస్థాయి ఆర్థిక, సామాజిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో మోదీతో పాటు నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా మాట్లాడనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

ఈ ఏడాదికి 'కొవిడ్-19 తర్వాత బహుళత్వం : 75వ వార్షికోత్సవం నాటికి ఏ విధమైన ఐక్యరాజ్యసమితి అవసరం" అనేది ఇతివృత్తం.

రెండో విడత ప్రధానిగా భారీ మెజారిటీతో ఎన్నికైన మోదీ.. భారత్‌ ఐరాస సభ్యత్వం హోదా పెరిగిన తర్వాత తొలిసారి ప్రసంగించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ప్రపంచదేశాల మధ్య ఉండాల్సిన సహకారం తదితరాలపై మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం. భద్రతామండలిలో భారత్‌ సభ్యత్వంపై కూడా చర్చ జరగనుంది.

ఇదీ చూడండి: కుల్​భూషణ్​కు​​ దౌత్య సాయంతో పాక్​ మళ్లీ వక్రబుద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.