ETV Bharat / bharat

మరికాసేపట్లో జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం, తూర్పు లద్దాఖ్​లో చైనాతో సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న వేళ... మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

PM Modi to address the nation on Tuesday evening
నేడు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
author img

By

Published : Jun 30, 2020, 4:20 AM IST

Updated : Jun 30, 2020, 2:28 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా సంక్షోభం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

"మంగవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు." - ప్రధానమంత్రి కార్యాలయం

జులై 1 నుంచి దేశంలో అన్​లాక్ 2.0 ప్రారంభం కానుంది. దీని కోసం సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్​డౌన్​ ఆంక్షలను మరింత సడలించి, మరిన్ని ఆర్థిక కార్యకలాపాలకు దశలవారీగా అనుమతిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై కూడా మోదీ ప్రసంగించే అవకాశముంది.

ఆరో ప్రసంగం

కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి 5 సార్లు ప్రసంగించారు. తాజాది ఆరో ప్రసంగం అవుతుంది.

  • మార్చి 19న ప్రధాని మోదీ తన ప్రసంగంలో... మార్చి 22న 'జనతా కర్ఫ్యూ' పాటించాలని విజ్ఞప్తి చేశారు.
  • మార్చి 24న ... దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్​ ప్రకటించారు. ఏప్రిల్ 14న ఈ లాక్​డౌన్ వ్యవధిని మే 3 వరకు పొడిగించారు.
  • ఏప్రిల్ 3న ఇచ్చిన వీడియో సందేశంలో... ఏప్రిల్ 5న కరోనాతో పోరాడుతున్న యోధుల (ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు) కోసం దీపాలను వెలిగించాలని ప్రజలను అభ్యర్థించారు.
  • మోదీ చివరిసారి (ఐదో సారి) జాతినిద్దేశించి చేసిన ప్రసంగంలో... కరోనా సంక్షోభం, లాక్​డౌన్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.

మనసులో మాట

మోదీ తన తాజా 'మన్​కీ బాత్' కార్యక్రమంలో... తూర్పు లద్దాఖ్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న శత్రుదేశానికి భారత్​ తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు.​​ అలాగే అన్​లాక్​ దశలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇటీవల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో.. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు... అన్​లాక్​ 2.0 దశ గురించి ఆలోచించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: హిందూ మహా సముద్రంలో నిఘా పెంచిన భారత్​

Last Updated : Jun 30, 2020, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.