అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం( యూఎస్ఐఎస్పీఎఫ్) మూడో వార్షిక సదస్సులో భాగంగా గురువారం ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల భాగస్వామ్యం, సంబంధాల బలోపేతం సహా కీలక అంశాలపై మాట్లాడతారని ఫోరం నిర్వాహకులు వెల్లడించారు.
"యూఎస్ఐఎస్పీఎఫ్ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించేందుకు సమయం కేటాయించటం సంతోషించదగ్గ విషయం. అది ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అమెరికా-భారత్ సంబంధాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. భౌగోళికంగా, రాజకీయంగా, వాణిజ్యం, సాంస్కృతికం, దౌత్య, శాస్త్రీయంగా ఇరు దేశాల భాగస్వామ్యం పరస్పరం ఆధారపడి ఉంది. చైనా దూకుడు చర్యలతో ఇరు దేశాలు మరింత సహకరించుకోవాల్సిన అవసరాన్ని చూపుతోంది."
- ముకేశ్ అగి, యూఎస్ఐఎస్పీఎఫ్ అధ్యక్షుడు
ఆగస్టు 31 నుంచి వారం రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సమావేశం ప్రారంభమైన రోజున భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఐరాస సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ