తమిళనాడులోని ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో తను చేయబోయే ప్రసంగానికి విలువైన సలహాలు, సూచనలు అందించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.
ముఖ్యంగా ఐఐటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమ ఆలోచనల్ని తప్పకుండా పంచుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు. నమో యాప్‌లోని ఓపెన్ ఫోరం ద్వారా తమ సలహాల్ని పంపించవచ్చని తెలిపారు.
హ్యాకథాన్ విజేతలకు..
చెన్నైలో జరిగే మరో కార్యక్రమంలో సింగపూర్-ఇండియా హ్యాకథాన్ పోటీల్లో విజేతలకు మోదీ.. పురస్కారాలు అందజేయనున్నారు. హ్యాకథాన్‌ని యువశక్తి, సృజనాత్మకతల కలయికగా అభివర్ణించారు ప్రధాని. దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం కనుగొనే యువతరాన్ని ఇలాంటి పోటీలు.. ఒక వేదిక మీదకు తీసుకొస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: గాంధీ-150: బాపూ, బాబా సాహెబ్ ఆలోచనలకు అదే తేడా