ETV Bharat / bharat

ఆగస్టు 5న రామమందిరం భూమిపూజ!

author img

By

Published : Jul 19, 2020, 11:00 PM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5వ తేదీన భూమిపూజ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. అయోధ్యలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారికానుంది. అయితే 3వ తేదీ నుంచే నిర్మాణ వేడుకలు ప్రారంభించనున్నట్టు పూజారులు పేర్కొన్నారు.

PM Modi plans 2 hr trip to Ayodhya on August 5 for Bhumi Pujan of Ram Temple
ఆగస్టు 5న రామమందిరం భూమిపూజ

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ నిర్వహించనున్నట్టు అక్కడి పూజారులు వెల్లడించారు. అయోధ్యలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ప్రధాని పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టు 3వ తేదీ నుంచే నిర్మాణ వేడుకలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 4న రామాచార్య పూజ, 5వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు భూమిపూజ చేసేందుకు నిర్ణయించారు. రామమందిరం ప్రాంతంతోపాటు, అయోధ్యలో ప్రధాని మోదీ మొదటిసారి పర్యటించనున్నారు.

'ఆగస్టు 3 లేదా 5వ తేదీన రామమందిరం భూమి పూజకు రావాలని ప్రధాని మోదీకి విన్నవించాం. పూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నాం' అని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇప్పుడే తేదీని కచ్చితంగా చెప్పలేనప్పటికీ.. ఆగస్టు 5న మోదీ అయోధ్యలో పర్యటించనున్నట్టు తనకు సమాచారం అందిందని వెల్లడించారు.

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు గత నవంబర్‌లో అనుమతించింది. ప్రత్యామ్నాయంగా కొత్త మసీదు నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్ బోర్డుకు పట్టణంలోని ప్రముఖ ప్రదేశంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'దేశంలో వర్షాలు అధికంగానే కురుస్తున్నాయ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.