71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని 'జాతీయ యుద్ధ స్మారకం' వద్ద అమర జవానులకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు విడిచిన వీరులను గుర్తుచేసుకున్నారు.
గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళులర్పించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు వరకు అమర్ జవాన్ జ్యోతి వద్దే శ్రద్ధాంజలి ఘటించేవారు.
రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ.. ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.
"ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జావడేకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:- '26'... భారత్కు ఈ సంఖ్య ఎంతో ప్రత్యేకం తెలుసా?