ETV Bharat / bharat

ముజిబుర్ రెహ్మాన్ గొప్ప ధైర్యం ఉన్న నాయకుడు-మోదీ - india pm

బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్​ శతజయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బంగ్లాదేశ్​ను​ మారణహోమం నుంచి బయటకు తీసుకురావడానికి రెహ్మాన్ తీవ్రంగా కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన లక్షణాలు బంగ్లాదేశ్ యువతకు కొత్త శక్తినిచ్చాయని అన్నారు.

pm modi participates in the birth centenary celebrations of jatir pita bangabandhu, sheikh mujibur rahman, via video conferencing
మోదీ
author img

By

Published : Mar 17, 2020, 9:26 PM IST

బంగ్లాదేశ్​ జాతిపిత షేక్​ ముజిబుర్ రెహ్మాన్​ గొప్ప ధైర్యమున్న నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్​లో నిర్వహించిన రెహ్మాన్ శత జయంత్యుత్సవ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆయనకు ఘన నివాళి తెలిపారు. బంగ్లాదేశ్​ను మారణహోమం నుంచి బయటకు తీసుకురావడానికి ముజిబుర్ రెహ్మాన్ తీవ్రంగా శ్రమించారని కొనియాడారు.

నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"బంగాల్​ బంధు అంటే నమ్మకం ఉన్న వ్యక్తి. ధైర్యం కల నాయకుడు. శాంతి, న్యాయం, సమానత్వం, గౌరవానికి చిహ్నం. ఇటువంటి లక్షణాలు ఆయన కాలంలో బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు లక్షలాది మంది యువతకు కొత్త శక్తినిచ్చాయి."-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ఈ సందర్భంగా బంగ్లాదేశ్-భారత్​ మధ్య ఉన్న సంబంధాలను గుర్తు చేశారు. చారిత్రక కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానించినప్పటికీ కరోనా కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్​ ఢాకాలో నేటి నుంచి ప్రారంభమై ఏడాది పొడవునా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు మోదీతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఎలాంటి బహిరంగ సభలు లేకుండా జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.