కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనే మార్గాలపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ఇవాళ సాయంత్రం జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కరోనాపై యుద్ధం
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు, స్థానిక అధికారులు కృషి చేయాలని ప్రధాని ఇప్పటికే పిలుపునిచ్చారు. మహమ్మారిపై విజయం సాధించడంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని.. ఈ మేరకు స్వీయ సంకల్పం, స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'