కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించడానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న సమావేశమయ్యే అవకాశాలున్నాయి. దిల్లీ, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు.
దేశవ్యాప్తంగా ఆగస్టు 11న ప్రధాని నిర్వహించిన సమావేశానికి 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వారి ప్రతినిధులు హాజరయ్యారు.
కరోనా విజృంభణ తర్వాత ప్రధాని తరచూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కేబినెట్ కార్యదర్శి సమీక్ష..
జాతీయ సగటు కంటే ఎక్కువగా కరోనా మరణాలు చోటు చేసుకుంటున్న 12 రాష్ట్రాల్లో కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించారు. శనివారం ఆయన ఉన్నతస్థాయి కమీక్ష నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రరదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, పంజాబ్ వంటివి ఉన్నాయి. మొత్తం కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో వాడీవేడి చర్చ