భారత దేశం గాంధీ సిద్దాంతాల్ని పాటిస్తుందని.. ఆయన మార్గం ఇప్పటికీ అనుసరణీయమని ఐరాస సదస్సు వేదికగా మోదీ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ఐదేళ్లలోనే 11 కోట్ల శౌచాలయాల నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇది ప్రపంచానికి కొత్త సందేశంగా తెలిపారు మోదీ.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- భారత్‌లో పేదలకు దేశం రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా కల్పిస్తున్నాం
- డిజిటలీకరణతో అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాం
- ఇప్పటికే 20 బిలియన్ డాలర్లు మేర ప్రజాధనం ఆదా అయ్యింది
- అక్టోబర్ 2 నుంచి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నాం
- 15 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించనున్నాం
- 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 2 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
- 2025 నాటికి క్షయ విముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం
- భారత్‌లో పేదలకు రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా కల్పిస్తున్నాం