బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే ఉత్తర్ప్రదేశ్లో అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న బుందేల్ఖండ్ ప్రాంతాన్ని దిల్లీతో కలపనుంది ఈ హైవే. యూపీలోని చిత్రకూట్, బండా, హమీర్పుర్, జలూన్ జిల్లాల మీదుగా వెళ్లనుంది.
బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు ప్రధాని మోదీ. రూ. 15వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా అనేక ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. పెద్ద నగరాల్లోని సౌకర్యాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
"సమూహం నుంచి శక్తి వస్తుంది. ఈ ఐకమత్యం ద్వారా రైతులు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతారు. రైతులకు ఉచిత ఫలాలను అందించేందుకు ఐక్యత అవసరం. నేడు రైతు ఉత్పత్తి సంఘాన్ని(ఎఫ్పీఓ) ప్రారంభించాం. దీని వెనుక కూడా ఇదే ఐకమత్యమనే భావన ఉంది. దేశంలో చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్నారు. గ్రామంలోని రైతులందరు ఐకమత్యంతో పనిచేస్తే వారి సామర్థ్యం ఎక్కువ అవుతుంది. రైతులు ఐకమత్యంగా ఉంటే ఇది సాకారమవుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం, వారి జీవితాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: '130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యం'