భారత్- రష్యా సంయుక్త ఆయుధ తయారీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తి చూపారు. ఇరు దేశాలు తమ సాంకేతికతను వినియోగించి భారత్‌లో చవక ధరలకే సైనిక పరికరాలను తయారు చేయవచ్చన్నారు. ఈ పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చన్నారు.
రష్యా పర్యటనలో ఉన్న మోదీ... వ్లాదివోస్తోక్లో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో నేడు చర్చలు జరపనున్నారు. పుతిన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
"పుతిన్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేం మంచి స్నేహితులం. మంచి మిత్రులు ఎప్పుడూ భవిష్యత్తు ప్రణాళికలను ఆలోచిస్తారు. మా సంబంధం కేవలం కొనుగోలుదారు- విక్రయదారు మాత్రమే కాదు. రక్షణ, సాంకేతిక సహకారాలకు మించి మా బంధం ముందుకు సాగుతోంది."
--- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.
20వ రష్యా- భారత్ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ- సాంకేతిక విభాగం సహా మరిన్ని అంశాలపై దాదాపు 15 ఒప్పందాలు జరగనున్నాయి.
భారత్ తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష మిషన్ 'గగన్‌యాన్'పైనా మోదీ స్పందించారు. ఈ మిషన్‌లో భాగంగా భారత వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి రష్యా సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రష్యా పర్యటనలో భాగంగా 2019 తూర్పు ఆర్థిక సదస్సు(ఈఈఎఫ్)లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు మోదీ. భారత్-రష్యా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ తూర్పు ఆర్థిక సదస్సు ఉపయోగపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- రాజధానిలో పెరిగిన 'మందు' భామలు..!