ETV Bharat / bharat

'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం' - నరేంద్ర మోదీ

నూతన సాగు చట్టాలు, ఒప్పంద వ్యవసాయంపై అనేక అపోహలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో జరుగుతోన్న కొన్ని నిరసనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారు. కిసాన్​ సమ్మాన్​ నిధి విడుదల తర్వాత రైతులతో మాట్లాడారు ప్రధాని.

pm-modi-interacts-with-farmers
సాగు చట్టాలపై ప్రధాని మోదీ ప్రసంగం
author img

By

Published : Dec 25, 2020, 12:53 PM IST

ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై వదంతులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజకీయాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. దేశంలో జరుగుతోన్న కొన్ని నిరసనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారు.

కిసాన్​ సమ్మాన్​ నిధి విడుదల కార్యక్రమంలో భాగంగా వర్చువల్​గా ఆరు రాష్ట్రాల రైతులతో మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కిసాన్​ క్రెడిట్​ కార్డులపై తోటి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. వాటి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని ప్రతి రైతు తెలుసుకొని లబ్ధిపొందేలా కృషి చేయాలని సూచించారు.

" ఒప్పంద వ్యవసాయంపై అనేక అపోహలు ప్రచారం చేస్తున్నారు. నూతన సాగు చట్టాల విషయంలో వదంతులు సృష్టిస్తున్నారు. కొత్త చట్టాలపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

సమ్మాన్​ నిధి విడుదల

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి పథకంలో భాగంగా పెట్టుబడి సాయం ఈ యాసంగి పంటకాలానికి రూ.18వేల కోట్లు విడుదల చేశారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. ఏటా ప్రతి రైతుకు అందించే రూ.6 వేల సాయంలో భాగంగా ఇవాళ రూ. 2 వేలు అందనున్నాయి.

ఇదీ చూడండి: 'బంగాల్​లో కమలం వికసించే వరకు నిద్రపోను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.