ETV Bharat / bharat

దక్షిణ కొరియా ప్రధానితో మోదీ సంభాషణ

దక్షిణ కొరియా ప్రధాని మూన్​ జే ఇన్​తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​లో మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలు సహా కరోనాపై పోరులో పురోగతి గురించి చర్చించారు. కీలకమైన అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు జరిపారు. అభివృద్ధి, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వర్తకాన్ని కాపాడుకోవాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారు.

PM Modi holds telephone conversation with South Korean president
దక్షిణ కొరియా ప్రధానితో మోదీ సంభాషణ
author img

By

Published : Oct 21, 2020, 7:05 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా ప్రధాని మూన్ జే ఇన్​తో ఫోన్​లో సంభాషించారు. కరోనా మహమ్మారిపై పోరులో పురోగతి సహా కీలకమైన అంతర్జాతీయ అంశాలపై ఇరుదేశాధినేతలు మాట్లాడుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

పారదర్శక, అభివృద్ధి-నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వర్తకాన్ని కాపాడుకోవాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారని పీఎంఓ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాముఖ్యంపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొంది.

మూన్​ జే ఇన్​తో సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ అంశాలతో పాటు కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు.

చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించారని పీఎంఓ తెలిపింది. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి- 'మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనను సహించం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.