ETV Bharat / bharat

'మాతృభాషలో విద్యాబోధనతోనే మానసిక వికాసం' - NEP-2020 news today

ఏ భాషను వింటూ విద్యార్థి నవ్వుతాడో, ఏ భాష అయితే ఇంటి భాష అవుతుందో అందులో చెప్పినప్పుడే విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక వికాసంలో కీలక పాత్ర వహిస్తుందన్నారు. కనీసం అయిదో తరగతి వరకూ మాతృభాషలో బోధనే మేలని.. '21వ శతాబ్దంలో పాఠశాల విద్య' అంశంపై జాతీయ సమ్మేళనంలో ప్రసంగించారు.

PM Modi
'మాతృభాషలో విద్యాబోధనతో పిల్లల్లో మానసిక వికాసం'
author img

By

Published : Sep 12, 2020, 7:10 AM IST

మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక వికాసంలో కీలకపాత్ర వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య ఇంటి/స్థానిక భాషలోనే కొనసాగాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలు ఇదే విషయాన్ని విశదీకరిస్తున్నాయని వివరించారు.'21వ శతాబ్దంలో పాఠశాల విద్య' అన్న అంశంపై రెండు రోజుల పాటు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన జాతీయ సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ప్రసంగించారు. 2018లో అంతర్జాతీయ విద్యార్థుల మదింపు కార్యక్రమం (పీసా)లో టాప్‌ ర్యాంకుల్లో ఉన్న ఎస్టోనియా, ఐర్లాండ్‌, ఫిన్‌ల్యాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, పోలండ్‌లు తమ పిల్లలకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన చేస్తున్నాయని తెలిపారు మోదీ. నూతన విద్యావిధానం వచ్చిన తర్వాత పిల్లల బోధన ఏ భాషలో ఉంటుంది? అందులో ఏం మార్పులు తెస్తున్నారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.

"భాష అన్నది బోధనా మాధ్యమమే తప్ప భాషే మొత్తం విద్య కాదన్న శాస్త్రీయ సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ భాషలో అయితే పిల్లలు సులభంగా చదువుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటారో అదే బోధనా భాషగా ఉండాలి. చదువు చెప్పేటప్పుడు మనం చెప్పేది వాళ్లు అర్థం చేసుకుంటున్నారా? లేదా? అన్నది చూడాలి. ఒకవేళ అర్థం చేసుకుంటుంటే ఎంత సులభంగా అర్థం చేసుకుంటున్నారన్నది గమనించాలి. చెప్పే విషయం కంటే భాషను అర్థం చేసుకోవడానికే పిల్లలు తమ శక్తిసామర్థ్యాలన్నింటినీ ధారపోసే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొనే చాలా దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే చెబుతున్నారు"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • నూతన విద్యా విధానంలో మాతృ భాషతో పాటు ఇతర భాషలు నేర్పడం, నేర్చుకోవడంపై అడ్డంకులు కల్పించలేదు. ఎన్ని విదేశీ భాషలైనా నేర్చుకోవచ్చు. కానీ అదే సమయంలో అన్ని భారతీయ భాషలనూ ప్రోత్సహిస్తాం.
  • పూర్వపాఠశాల (ప్రీ స్కూల్‌) స్థాయి నుంచే బలమైన పునాది వేయాలన్న ఉద్దేశంతోనే 10+2 విద్యావిధానం స్థానంలో 5+3+3+4 వ్యవస్థను చాలా ఆలోచించి తీసుకొచ్చాం. చదవడం కోసం నేర్చుకోవటం కాకుండా నేర్చుకోవటం కోసం చదువుకోవటం అన్న దిశగా విద్యావిధానాన్ని మార్చుతున్నాం. మన విద్యార్థులను 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్లాలి. కోడింగ్‌, కృత్రిమ మేథ, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటాసైన్స్‌, రోబోటిక్‌ సైన్స్‌ గురించి తెలుసుకోవాలి. నూతన విద్యావిధానంపై వారం రోజుల్లో టీచర్ల నుంచి 15లక్షలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి.
  • ఏ భాషను వింటూ విద్యార్థి నవ్వుతాడో, ఏ భాష అయితే ఇంటి భాష అవుతుందో అందులో చెప్పినప్పుడే విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారు. పిల్లలు అన్యభాషను వింటున్నప్పుడు తొలుత వారు మనసులో సొంత భాషలోకి అనువదించుకొని ఆ తర్వాతే అర్థం చేసుకుంటారు. ఇది మస్తిష్కాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. ఒత్తిడికి గురిచేస్తుంది. ఇతర భాషల్లో విద్యాబోధన చేస్తే మన గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు వారి పిల్లల చదువులతో అనుసంధానం కాలేరు. సాధ్యమైనంత వరకు కనీసం అయిదో తరగతి వరకైనా మాతృ భాషలోనే విద్యాబోధన చేయాలని నూతన విద్యావిధానం చెబుతోంది.

ఇదీ చూడండి: '21వ శతాబ్దానికి 'ఎన్​ఈపీ' దిక్సూచి లాంటిది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.