నేతాజీ గర్వపడేవారు..
ఒకప్పుడు నేతాజీ కలలు కన్న విధంగా.. ఇప్పుడు ఎల్ఏసీ నుంచి ఎల్ఓసీ వరకు భారత దేశం ఎంతో శక్తివంతంగా ఎదిగిందని ప్రధాని వెల్లడించారు. దేశ సార్వభౌమత్యానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ భారత్ దీటుగా జవాబు చెప్పిందన్నారు.
ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ గురించి ప్రస్థావించారు. నేతాజీ ఇప్పుడు ఉండి ఉంటే.. టీకా విషయంలో ఇతర దేశాలకు భారత్ సహాయం చేస్తున్న తీరును చూసి గర్వపడేవారని పేర్కొన్నారు.