ETV Bharat / bharat

'పాక్​ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది' - మోదీ సర్దార్​ పటేల్​ జయంతి

గుజరాత్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ... విపక్షాలనుద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి సమయంలో కొందరు రాజకీయాలు చేశారని.. వారిని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. తనను ఎన్ని మాటలన్నా సహించానని పేర్కొన్నారు. పుల్వామా వ్యవహారంపై పాక్​ నిజాన్ని అంగీకరించడం వల్ల వారి స్వార్థపూరిత రాజకీయాలు బయటపడ్డాయన్నారు.

Pm Modi attacks opposition on Pak's Pulwama statement
'పాక్​ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది'
author img

By

Published : Oct 31, 2020, 10:52 AM IST

పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ కొందరు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారని.. విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమర వీరుల మరణం పట్ల దుఃఖంలో ఉన్న తనను ఎన్నో మాటలన్నారని తెలిపిన మోదీ.. వాటన్నింటినీ సహించినట్టు వెల్లడించారు. సర్దార్​ పటేల్​ జయంతి సందర్భంగా గుజరాత్​ ఐక్యతా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.

పుల్వామా ఉగ్రాదాడిని తమ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ ప్రభుత్వ​ విజయంగా అభివర్ణించింది పాకిస్థాన్​. ఆ దేశ పార్లమెంట్​ వేదికగా ఓ మంత్రి ఈ వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడే వారి నిజస్వరూపం బయటపడిందన్నారు మోదీ. నీచ రాజకీయాలను మానుకోవాలని సర్దార్​ సాక్షిగా అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు మోదీ.

'పాక్​ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది'

"(పుల్వామా దాడి) జవాన్ల మరణ వార్త విన్న సమయంలో దేశ ప్రజలంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కానీ కొందరు ప్రజల దుఃఖంలో పాలుపంచుకోలేదు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ వీరు రాజకీయాలు చేశారు. ఎలాంటి మాటలన్నారో దేశ ప్రజలు మర్చిపోరు. ఎలా భయపెట్టారో మర్చిపోరు. దేశం విలవిలాలడుతున్న సమయంలో స్వార్థపూరిత రాజకీయాలు చేసిన వారిని దేశం మర్చిపోదు. అప్పుడు... అమర వీరులను చూస్తూ నేను వివాదాలకు దూరంగా నిలబడ్డాను. ఎన్ని ఆరోపణలు చేసినా పడ్డాను. తప్పుడు మాటలు మాట్లాడినా సహించాను. జవాన్ల మరణంతో నా మనస్సు దుఃఖించింది. కానీ.. పొరుగు దేశం(పాకిస్థాన్​) నుంచి ఇటీవలే ఓ వార్త వచ్చింది. ఆ దేశ పార్లమెంట్​లోనే నిజాన్ని బయటపెట్టారు. దీంతో ఆరోపణలు చేసే వారి నిజస్వరూపం బయటపడినట్టు అయ్యింది. స్వార్థపూరిత రాజకీయాల కోసం వారు ఎక్కడి వరకైనా వెళతారనేది పుల్వామా ఉదంతంతో ప్రజలకు తెలిసొచ్చింది. వారందరనీ నేను ప్రార్థిస్తున్నా. దేశ హితం కోసం దయ చేసి ఇలాంటి రాజకీయాలు చేయకండి."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

'కరోనాపై మనదే విజయం'

కరోనా సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఎవరూ ఉహించలేదన్న మోదీ.. మహమ్మారిని భారత్​ ఐకమత్యంతో ఎదుర్కొందన్నారు. చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కశ్మీర్ అభివృద్ధి అంశాన్ని కూడా ప్రస్తావించారు మోదీ. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​లో జరుగుతున్న అభివృద్ధితో దేశం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.

అంతకుముందు.. సర్దార్​ పటేల్​ జయంతి సందర్భంగా ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. పటేల్​విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివాస్​ పరేడ్​ను వీక్షించారు. పోలీసులు, సైన్యానికి సెల్యూట్​ చేశారు. పటేల్​ మార్గదర్శకాల్లో నడిచి దేశ ప్రగతికి దోహదపడాలని దేశం మరోమారు ప్రతిజ్ఞ చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:- సర్దార్​ పటేల్​కు ప్రముఖుల నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.