దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున ప్రధాన ప్రచారకర్తగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో.. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్ళిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయని జావడేకర్ చెప్పారు.
దిల్లీ శాసనసభ ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడమే తమ పార్టీ వ్యూహమన్నారు కేంద్ర మంత్రి. దిల్లీ ఎన్నికల్లో భాజపాకు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారని తెలిపారు. కేజ్రీవాల్ 2015లో గెలవడానికి కారణం అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమమేనన్నారు. ఆ ఉద్యమానికి లభించిన ప్రజాదరణ కేజ్రీవాల్‌కు ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:బంగాల్: సీఐడీ వాహనాలను పేల్చేసిన దుండగులు