ETV Bharat / bharat

ఆరోగ్య భారతం: ప్రతి పౌరుడికీ హెల్త్​ ఐడీ జారీ

దేశ పౌరుల కోసం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ అందిస్తామని, తద్వారా వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దేశంలోని ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా.. కార్డు ద్వారా వివరాలు తెలుస్తాయని వివరించారు.

modi speech
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన మోదీ
author img

By

Published : Aug 15, 2020, 8:51 AM IST

కరోనా సంక్షోభం ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అవసరాన్ని తెలియజెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్' ప్రారభిస్తున్నట్లు ప్రకటించారు.

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని మోదీ ఉద్ఘాటించారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నంబర్​(హెల్త్ ఐడీ)తో వైద్య కార్డు అందించనున్నట్లు తెలిపారు. పౌరుల ఆరోగ్యం, అప్పటివరకు పొందిన వైద్యం వివరాలన్నీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయని వెల్లడించారు.

దేశంలో ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా కార్డు ద్వారా వివరాలు తెలుస్తాయని చెప్పారు మోదీ. వైద్యులతో అపాయింట్​మెంట్​, చికిత్స సహా హెల్త్​ ఐడీతో అన్ని సేవలు ఆన్​లైన్​లోనే లభ్యమవుతాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.