ఆర్టికల్ 370 రద్దుతో ఒకే దేశం- ఒకే రాజ్యాంగం కల సాకారమైందని హర్షం వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్ర మోదీ. జీఎస్టీతో ఒకే దేశం- ఒకే పన్ను..., విద్యుత్ రంగంలో ఒకే దేశం- ఒకే గ్రిడ్..., రవాణా రంగంలో కామన్ మొబిలిటీ కార్డ్‌తో ఒకే దేశం- ఒకే కార్డ్ ఆకాంక్ష నెరవేరిందని గుర్తుచేశారు.
ఒకే దేశం- ఒకే ఎన్నిక కలను సాకారం చేసుకోవడమే తదుపరి లక్ష్యమని స్పష్టంచేశారు మోదీ. ఇందుకోసం విస్తృత చర్చలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశం మరింత అభివృద్ధి చెందేందుకు జమిలీ ఎన్నికలు తప్పనిసరి అన్నారు మోదీ.
ఇదీ చూడండి- 'జల్ జీవన్'తో ఇంటింటికీ తాగునీరు: మోదీ