ETV Bharat / bharat

పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ - business news

వైరస్ కారణంగా మందగమనంలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం ప్రభుత్వంలోని ముఖ్యులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ సమగ్ర సమావేశాన్ని నిర్వహించారు. పెట్టుబడిదారులకు అవసరమైన విధానాలను అనుసరించాలని ఆయా శాఖలను ఆదేశించారు.

pm
'పెట్టుబడుల ఆకర్షణతో ఆర్థిక వ్యవస్థకు దన్ను'
author img

By

Published : Apr 30, 2020, 7:29 PM IST

కరోనా కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, దేశీయ పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించేందుకు అవసరమైన వ్యూహాలపై సమగ్ర సమావేశాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పారిశ్రామిక ప్రాంతాల్లోని స్థలాల్లో మౌలిక వసతుల కల్పనకు తగిన ఆర్థిక సాయం అందించే పథకంపై అధికారులతో చర్చించారు. పెట్టుబడిదారులకు మరింతగా సహకరించే విధానాలను అనుసరించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

నిర్ణీత సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు వచ్చేలా, వారి సమస్యలు పరిష్కరించాలని నిర్దేశించారు. దేశీయ రంగాలను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపైనా ఈ సమావేశంలో ప్రధాని చర్చించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీరాతామన్, వాణిజ్య మంత్రి పీయూష్​ గోయల్, హోం మంత్రి అమిత్ షా సహా ఇతర శాఖల మంత్రులు, సహాయ మంత్రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ కాలంలో మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.