బిహార్లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి సహాయ నిధి(పీఎం కేర్స్ ఫండ్) కింద రెండు 500 పడకల కొవిడ్ తాత్కాలిక ఆస్పత్రులకు నిధులను సమకూర్చనుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ 500 పడకలలో.. 125 అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ), 375 సాధారణ చికిత్సకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది పీఎంఓ. సాయుధ బలగాలకు చెందిన పారా మెడికల్ సిబ్బంది ఈ ఆస్పత్రుల్లో సేవలందించనున్నారు.
పట్నాలోని బిహ్తాలో సోమవారం ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు పీఎంఓ స్పష్టం చేసింది. త్వరలోనే ముజఫర్నగర్లో మరో వైద్యశాలను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి: 'భాజపాతో కుమ్మక్కు'పై కాంగ్రెస్లో రగడ