పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్టీల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఆయా పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది. ఈనెల 19న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనుంది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మోదీ తరఫున లేఖ రాశారు.
సమావేశం అజెండా...
- పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించడం.
- ఒకే దేశం- ఒకే ఎన్నికలు
- 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం
- మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ.
- వెనుకబడిన జిల్లాల అభివృద్ధి.
ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని పార్టీ అధినేతలకు ఆహ్వానం పంపింది కేంద్రం.
- ఇదీ చూడండి: 'రామ మందిరం నిర్మించే సత్తా మోదీకి ఉంది'