ETV Bharat / bharat

అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​ - 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' పేరుతో ఓ ట్రస్ట్​ను ఏర్పాటు చేసినట్టు లోక్​సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ట్రస్ట్​లో 15మంది సభ్యులు ఉండనున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పులోని ఆదేశాల మేరకు.. మసీదు నిర్మాణానికి ఉత్తర్​ప్రదేశ్​లోని ధన్నీపుర్​లో సున్నీఫక్ఫ్​ బోర్డుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ యోగీ ఆదిత్యనాథ్​ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది.

PM announces trust for construction of Ram Temple in Ayodhya
అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​
author img

By

Published : Feb 5, 2020, 8:27 PM IST

Updated : Feb 29, 2020, 7:42 AM IST

అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​

సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు మేరకు అయోధ్య ఆలయ నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' పేరుతో రిజిస్ట్రేషన్​ కూడా చేసింది. ఇదే విషయాన్ని లోక్​సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

"కోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో పాటు.. మిగిలిన అంశాలకు సంబంధించి ఒక పథకాన్ని మా ప్రభుత్వం రూపొందించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్​ను ఏర్పాటు చేశాం. ఈ ట్రస్ట్​.. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, ఇతర విషయాలపై పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

గతేడాది నవంబరు 9న తీర్పు

అయోధ్య భూవివాదంపై గతేడాది నవంబర్​ 9న సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. సున్నీ వక్ఫ్​ బోర్డుకు ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

15మందితో ట్రస్ట్​...

శ్రీరామ్​ తీర్థక్షేత్రలో మొత్తం 15మంది ట్రస్టీలుగా ఉండనున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీకి చెందిన వారికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ట్వీట్టర్​లో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.

PM announces trust for construction of Ram Temple in Ayodhya
అమితా షా ట్వీట్​

'షా' ట్వీట్​ చేసిన కొద్దిసేపటికి.. దిల్లీలోని గ్రేటర్​ కైలాశ్​ ప్రాంతంలో ట్రస్ట్​కు సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

ట్రస్ట్​ కార్యాలయం(ఆర్​-20, గ్రేటర్​ కైలాశ్​ పార్ట్​-1, న్యూ దిల్లీ, 110048) ఉండే నివాసం.. న్యాయవాది పరాశరన్​కు చెందినది. ఆయన రెండుసార్లు అటార్నీ జనరల్​గా పనిచేశారు. అయోధ్య కేసులో హిందువుల తరఫున వాదించిన ముఖ్య న్యాయవాది కూడా ఆయనే​.

ధన్నీపుర్​లో ఆ 5 ఎకరాలు...

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సున్నీఫక్ఫ్​ బోర్టుకు అందించే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమికి ఉత్తరప్రదేశ్​ కేబినెట్​ ఆమోద ముద్రవేసింది. అయోధ్యకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపుర్​ అనే గ్రామంలో.. మసీదు నిర్మించుకునేందుకు ఐదెకరాల భూమిని కేటాయించింది యోగీ సర్కారు.

'మరో రామమందిరం నిర్మిస్తాం...'

మరోవైపు... సున్నీ వక్ఫ్​ బోర్డుకు అందించిన భూమిపై అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు (ఏఐఎంపీఎల్​బీ) స్పందించింది. సున్నీ వక్ఫ్ బోర్డు ఆ భూమిని స్వీకరిస్తే.. ఆ నిర్ణయం దేశంలోని ముస్లింలందరి అభిప్రాయం కాదని స్పష్టం చేసింది.

అయితే.. సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన భూమిని తమకు ఇస్తే మరో రామమందిరాన్ని నిర్మిస్తామని ఉత్తర్​ప్రదేశ్​ షియా వక్ఫ్ బోర్డు తెలిపింది.

దిల్లీ ఎన్నికలపై ప్రభావం!

మరో రెండు రోజుల్లో దిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేంద్ర కేబినెట్​ ఆయోధ్యలో ఆలయ నిర్మాణంపై ట్రస్ట్​ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే దిల్లీ ఎన్నికలు, రామమందిర నిర్మాణం అనేవి వేర్వేరు అంశాలనీ.. రెండింటికీ ముడిపెట్టడం సరికాదని భాజపా మంత్రులు వెల్లడించారు.

ఈ అంశంపై ఎన్నికల సంఘం కూడా ఇదే విధంగా స్పందించింది. ట్రస్ట్​కు సంబంధించిన వివరాల​ ప్రకటనకు తమ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.

కేంద్రం నిర్ణయాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ స్వాగతించారు. మంచి పనులు చేయడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదన్నారు.

ZCZC
PRI ESPL INT
.BALI FES47
INDONESIA-CHINESE-TOURISTS
Thousands of Chinese tourists stranded in Bali after flights suspended
          Bali, Feb 5 (AFP) Thousands of Chinese tourists risk being stranded in Bali after the Indonesian government suspended flights to and from mainland China over fears of the deadly coronavirus outbreak.
          With flights to be suspended at midnight Wednesday, at least 5,000 Chinese tourists are currently on the holiday island, according to Gou Haodong, the Chinese Consul General in Denpasar.
          Some are hoping to secure visa extensions offered by Bali deputy governor Tjokorda Oka Artha Ardhana Sukawati.
          "Many foreign tourists want to extend their vacation in Bali and it is fine," he said.
          But concerns surround delayed departures.
          "We hope that Bali immigration office could facilitate Chinese tourists who have to overstay due to the policy," Haodong said.
          Some hotels had given assurances the visitors would be treated well during their extended stay, Haodong said, but he noted one establishment had "rejected Chinese tourists who have earlier checked in and entered their rooms due to panic over coronavirus".
          The number of Chinese tourists has already fallen from about 6,000 per day to just to 1,000 since the outbreak started in mid-December.
          Indonesia has yet to report a confirmed case of the virus, which emerged in a Chinese market at the end of last year and has since killed almost 500 people in China and spread around the world. (AFP)
IND
02051844
NNNN
Last Updated : Feb 29, 2020, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.