దేశ సమగ్రతకు, ఐక్యతకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జనసంఘ్ వ్యవస్థాపకుని 66వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్లో నివాళులర్పించారు.
"దేశ ఐక్యత కోసం డా.ముఖర్జీ ఎంతో అంకితభావంతో కృషి చేశారు. దృఢమైన దేశం కోసం ఆయన పడిన తపన ఆదర్శనీయం. 130కోట్ల మందికి సేవ చేసే బలాన్నిచ్చారు. "
-ప్రధాని మోదీ ట్వీట్.
షా, నడ్డాల నివాళి
దిల్లీలో ముఖర్జీ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. భాజపా కార్యకర్తలు ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు నడ్డా.
"కోల్‌కతా యూనివర్సిటి వైస్ ఛాన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బంగాల్ ఆర్థిక మంత్రిగా సేవలందించారు. జన్‌సంఘ్ మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నపుడు ముఖర్జీ నేతృత్వం వహించారు. నెహ్రూ హయాంలో మంత్రిగా పని చేశారు. జాతీయవాదాన్ని పెంపొందించి దేశ సేవ చేయడమే ఆయన ఉద్దేశం. కశ్మీర్‌పై ఆయన అప్పుడే దూరదృష్టితో ఆలోచించారు. ఒక దేశంలో రెండు లక్ష్యాలు, రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులుండటం సరికాదని అప్పుడే చెప్పారు."
-జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు.
1953, జూన్ 23న జమ్ముకశ్మీర్‌లో మరణించారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఆయన మృతికి గల కారణాలు ఇప్పటికి రహస్యమే.
- ఇదీ చూడండి: ఈవీఎం భాగాల మాయంపై సందేహాలు ఎన్నో...