కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం వివాదంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పౌరసత్వంపై స్పష్టత వచ్చేవరకు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలు జారీ చేయించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.
2015 నవంబర్‌లో భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి... రాహుల్ స్వచ్ఛందంగా బ్రిటన్ పౌరసత్వాన్ని పొందారన్న సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. అయినప్పటికీ హోం శాఖ చర్యలు తీసుకోకపోవటంపై అసంతృప్తిగా ఉన్నట్లు పిటిషనర్లు జయ్ భగవాన్ గోయల్, సీపీ త్యాగీ తెలిపారు. ప్రాథమిక ఆధారాలు సమర్పించినందున... లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను పోటీ చేయనీయరాదని వాదించారు.
ఓటర్ల జాబితా నుంచి రాహుల్ పేరు తొలగించేలా ఈసీని ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది బరున్ కుమార్ సిన్హా అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై విచారణ వచ్చే వారం జరిగే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'ఉదయం 5 నుంచి పోలింగ్ నిర్వహించలేరా?'