జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, పాక్ చెరలో భారత వాయుసేన పైలట్ ఉన్న పరిస్థితుల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోదీ.
"మొదటగా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టే సంప్రదాయం ఉంది. అనంతరం దాని విస్తరిస్తారు. ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే చేపట్టాం. ఇప్పుడు నిజమైనవి చేపట్టాలి. ఇంతకుముందు జరిగింది అంతా ప్రాక్టీస్ మాత్రమే. నిజానికి ఈ రోజు అవార్డు గెలుచుకున్న వారికి నిలబడి మర్యాద ఇవ్వాలి." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి