ETV Bharat / bharat

మద్యం నిషేధానికి సుప్రీంకోర్టులో వ్యాజ్యం

author img

By

Published : Jul 1, 2020, 8:36 PM IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం, మత్తుపానీయాల వినియోగాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి తగ్గి.. వైరస్​ ముప్పు అధికంగా ఉంటుందని వ్యాజ్యంలో పిటిషనర్​ పేర్కొన్నారు. మద్యాన్ని నిషేధించడం కోసం సమర్థవంతమైన విధానాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

PIL in SC to ban consumption of liquor
మద్యం నిషేధానికి సుప్రీంలో వ్యాజ్యం

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​తో మందు దొరక్క ఇబ్బందులు పడ్డ మద్యం ప్రియులకు మరోమారు ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం, మత్తుపానీయాల వినియోగంపై నిషేధం విధించాలని.. సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

మద్యం నిషేధానికై భాజపా నేత, న్యాయవాది అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది అశ్విని కుమార్​ దూబే ద్వారా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

"కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మద్యం వినియోగం వల్ల.. తీవ్ర అనారోగ్యం సహా వైరస్​ ముప్పు తెచ్చే ప్రవర్తన, మానసిక ఆరోగ్య సమస్యలు, హింసాత్మక ఘటనలు పెరుగుతాయి. మద్యం, మత్తు పానీయాలను తీసుకోవటం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్​ సోకే ప్రమాదం అధికమవుతుంది. వాటితో పాటు గృహ హింస, మహిళలపై దాడులు పెరుగుతాయి."

- వ్యాజ్యంలో పిటిషనర్​

పిటిషన్​లోని మరిన్ని అంశాలు..

  • మద్యం, మత్తుపానీయాలను నిషేధించడానికి సమర్థవంతమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
  • ఆరోగ్యపరమైన హెచ్చరికలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను బాటిళ్లపై ఇరువైపులా 50 శాతానికిపైగా ఉండేలా.. హిందీ, ఆంగ్ల భాషల్లో ముద్రించాలి.
  • మత్తు పానీయాల ప్రకటనలను నిషేధించి.. ఎలక్ట్రానిక్​, ప్రింట్​ మీడియాతో పాటు సామాజిక మాద్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు ప్రారంభించాలి.
  • మద్యం సేవించటం ద్వారా కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రాథమిక తరగతుల పాఠ్యాంశాల్లో ఓ పాఠాన్ని​ చేర్చాలి.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: నెలరోజుల్లో ఎన్నివేల కోట్లు తాగేశారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.