పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి, సిగరెట్స్, దిగుమతి చేసుకునే కార్లతో పాటు పలు వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. మోదీ 2.0 ప్రభుత్వంలో తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భారీ సంఖ్యలో వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ధరలు పెరిగేవి..
- పెట్రోల్, డీజిల్
- సిగరెట్స్, హుక్కా, పొగాకు ఉత్పత్తులు
- బంగారం, వెండి
- విదేశీ కార్లు
- స్ల్పిట్ ఎయిర్ కండిషనర్లు
- లౌడ్ స్పీకర్లు
- డిజిటల్ వీడియో కెమెరా రికార్డర్లు
- దిగుమతి చేసుకునే పుస్తకాలు
- సీసీటీవీ కెమెరాలు
- జీడిపప్పు
- దిగుమతి చేసుకునే ప్లాస్టిక్ వస్తువులు
- సబ్బుల తయారీ ముడి పదార్థాలు
- వినైల్ ఫ్లోరింగ్, టైల్స్
- ఆప్టికల్ ఫైబర్
- సిరామిక్ టైల్స్, వాల్ టైల్స్
- దిగుమతి చేసుకునే స్టెయిన్ లెస్ స్టీల్ ఉత్పత్తులు
- దిగుమతి చేసుకునే వాహనాల విడిభాగాలు
- వార్తా పత్రికలు, మ్యాగజైన్లకు వినియోగించే న్యూస్‌ప్రింట్, పేపర్
- మార్బుల్ స్లాబ్స్
- ఖరీదైన గృహోపకరణాలు
ధరలు తగ్గేవి...
- విద్యుత్ వాహనాల పరికరాలు
- కెమెరా పరికరాలు, మొబైల్ ఫోన్ల ఛార్జర్లు
- సెట్ టాప్ బాక్స్‌లు
- భారత్‌లో తయారు కాని, దిగుమతి చేసుకునే రక్షణ ఉత్పత్తులు