ETV Bharat / bharat

అనాథ జంతువులంటే ప్రాణం.. ఆయన ఇల్లే ఆవాసం - nei kuppai latest news

ప్రతికూలతలు ఎదురైనప్పటికీ అనాథ జంతువులకు తన ఇంటినే ఆవాసంగా మార్చారు ఆయన.. వాటి కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఎవరు? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం.

pet lover
అనాథ జంతువులంటే ప్రాణం.. ఆయన ఇల్లే ఆవాసం
author img

By

Published : Mar 3, 2020, 6:47 AM IST

Updated : Mar 3, 2020, 8:13 AM IST

అనాథ జంతువులంటే ప్రాణం.. ఆయన ఇల్లే ఆవాసం

ఉన్నత చదువు. మంచి ఉద్యోగం, వేతనం. హాయిగా సాగుతున్న కుటుంబ జీవితం. అయితే ఇవేవీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. అనాథ జంతువులకు ఆపద్బాంధవుడయ్యారు. మూగ జీవాలపై మమకారంతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో కోల్పోయినప్పటికీ వాటి సేవలోనే తరిస్తూ అందులోనే సంతృప్తి పొందుతున్నారు గోపాలకృష్ణన్.

తమిళనాడులోని తిరువారూర్ జిల్లా నెయ్ కుప్పై గ్రామానికి చెందిన గోపాలకృష్ణన్ ఎంసీఏ చదివారు. మధురై, బెంగుళూరులో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేశారు. జీవకారుణ్యంపై మమకారంతో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు.

"సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో మంచి జీతం విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకుని ఏడెనిమిది కుక్కలతో నేను మా ఊరు వచ్చాను. మా ఊళ్లో కూడా జంతువులను హింసిస్తే ఉండలేక పోయాను. పశు సంక్షేమం అని ప్రభుత్వంలో ఓ శాఖ ఉంది. అది నామమాత్రంగా ఉండకూడదు. నాలా జంతువులను పరిరక్షిస్తున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే బావుంటుంది."

-గోపాల కృష్ణన్

ఐదేళ్ల క్రితం ఏం జరిగిందంటే..

ఐదేళ్ల క్రితం గోపాలకృష్ణన్ మధురైలో ఉద్యోగం చేసే రోజుల్లో రహదారిపై బండికింద పడి దెబ్బ తగిలిన వీధి కుక్కను తన అద్దె ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించి పెంచారు. అనంతరం దారిలో ఎక్కడైనా దెబ్బ తగిలిన వీధి కుక్కలు కనిపిస్తే తీసుకొచ్చి వైద్యం చేసి పెంచడం మొదలు పెట్టారు. కుక్కల గోల తాము భరించలేక పోతున్నామని ఇరుగుపొరుగు వారు అనడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంతూరు వెళ్లి అక్కడ తన ఇంట్లో వాటికి చోటు కల్పించారు.

అదే ఆయన పని..

సొంతూళ్లో గుళ్లకు దానమిచ్చే గొర్రెలనూ ఆయన పెంచడం మొదలు పెట్టారు. దెబ్బలు తగిలిన మేకలు, గొర్రెలు అనాథలుగా పడి ఉన్న ఇతర మూగ జీవాలకు కూడా తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చారు. పగలు వాటిని మేత కోసం బయటకి తీసుకెళ్లడం, సాయంత్రం ఇంట్లోనే పరిరక్షించడాన్ని నిత్య కృత్యంగా పెట్టుకున్నారు.

భార్య దూరమై..

గోపాలకృష్ణన్ భార్య అదే ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భర్త ఉద్యోగం వదిలేసి ఇలా గమూజీవాల సేవకే పరిమితమై పోవడం వల్ల భార్య తన పిల్లల్ని తీసుకుని అతడిని వదిలి వెళ్లిపోయి విడిగా ఉంటోంది. ప్రస్తుతం 60 గొర్రెలు, మేకలు, 20 వీధికుక్కలు, 25 పిల్లులను పెంచుతున్నాడు గోపాలకృష్ణన్​.

హింసిస్తే ఊరుకోరు

జంతువుల కోసం పరుపులు, దిళ్లు, ఫ్యాన్​ వంటి వసతులు సైతం ఏర్పాటు చేశారు. నెమళ్లు, ఉడుములను ఎవరైనా వేటాడి హింసించేది చూసినట్లైతే వారిని అడ్డుకుంటారు గోపాలకృష్ణన్​. ఇళ్లలోని పెంపుడు జంతువులైనా సరే హింసిస్తుంటే ఊరుకోరు. అవసరమైతే జీవకారుణ్యం వారికి ఫిర్యాదులు చేస్తుంటారు. ఇందువల్ల ఊళ్లో సైతం పలు వ్యతిరేకత ఎదురైనా ఆయన జంకలేదు. రోజు రోజుకు పెరుగుతున్న అనాథ జంతువులకు తన ఇల్లు సరిపోవడం లేదని ప్రభుత్వం వీటి కోసం ఒక సంరక్షణాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే

Last Updated : Mar 3, 2020, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.