ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లకు ముందు విదేశీ నిధుల పంపిణీ: షా

దిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు విదేశీ నిధులను వినియోగించినట్లు సమాచారం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వెల్లడించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరిని వదిలేది లేదని స్పష్టం చేసారు. దిల్లీ హింసాత్మక ఘటనలపై రాజ్యసభలో చర్చ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు.

Shah
దిల్లీ అల్లర్లకు విదేశీ నిధుల వినియోగం: షా
author img

By

Published : Mar 12, 2020, 8:29 PM IST

Updated : Mar 12, 2020, 11:10 PM IST

దిల్లీ అల్లర్లకు ముందు విదేశీ నిధుల పంపిణీ: షా

దిల్లీ అల్లర్లకు పాల్పడిన వారిపై కుల, మత, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అల్లర్లు జరిగే ముందు విదేశీ నిధులు పంపిణీ జరిగినట్లు సమాచారం లభించినట్లు తెలిపారు.

దిల్లీ హింసాత్మక ఘటనపై రాజ్యసభలో చర్చ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు అమిత్​ షా. ఇప్పటి వరకు 700 ఎఫ్​ఐఆర్​లు నమోదు కాగా, 2,600 మందిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

"అల్లర్లు సృష్టించిన వారు, మద్దతు ఇచ్చిన వారు ఏ కులానికి, మతానికి, పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టేది లేదు. పెద్ద ఎత్తున మాకు సాంకేతిక ఆధారాలు లభించాయి. ముఖాన్ని గుర్తించే సాప్ట్​వేర్​ను వినియోగిస్తున్నాం. దాని కోసం ఆధార్​ సమాచారాన్ని వినియోగించలేదు. నిన్న కొన్ని మీడియాల్లో తప్పుడు సమాచారం ప్రసారమైంది. డ్రైవింగ్​ లైసెన్స్​, ఓటర్​ ఐడీల సమాచారం మాత్రమే ముఖాలను గుర్తించేందుకు ఉపయోగించాం. ఇంత భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగినప్పుడు.. పోలీసులకు అధికారం ఇవ్వాలా వద్దా? ఈ అల్లర్లను సృష్టించిన వారిని గుర్తించి కోర్టు ముందు నిలబెడతాం. కఠినంగా శిక్షించి తీరుతాం. ఇందులో మేము సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

సిట్​కు 50 క్రిమినల్​ కేసులు

ముఖాలు గుర్తించే సాఫ్ట్​వేర్​ ద్వారా ఇప్పటి వరకు 1922 మంది వ్యక్తుల ముఖాలు గుర్తించామని తెలిపారు షా. హత్య, మతపరమైన ప్రాంతాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలపై దాడులకు సంబంధించి 50 తీవ్రమైన కేసులను మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్​)లకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. 40కి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అల్లర్లు సృష్టించిన వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు షా.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే మోదీ నిద్రపోతున్నారు'

Last Updated : Mar 12, 2020, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.