ETV Bharat / bharat

'నెలకు నాలుగురోజుల పీరియడ్ ​లీవ్స్​పై స్పందించండి'

మహిళా ఉద్యోగులకు నెలకు నాలుగు రోజులు వేతనంతో కూడిన రుతుక్రమం సెలవులను ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు విచారించింది. దీనిపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Period Leaves: Decide in time-bound manner: HC tells authorities
'నెలకు నాలుగురోజుల పీరియడ్ ​లీవ్స్​పై స్పందించండి'
author img

By

Published : Nov 23, 2020, 3:54 PM IST

మహిళా ఉద్యోగులకు నెలకు నాలుగు రోజులపాటు వేతనంతో కూడిన పీరియడ్​ లీవ్స్​ ఇవ్వాలంటూ దిల్లీ లేబర్​ యూనియన్​ దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు విచారించింది. దీనిపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది.

మహిళల గౌరవానికి సంబంధించి చట్టంలోని నియమనిబంధనలు, ప్రభుత్వ పాలసీలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీఎన్​.పాటిల్, జస్టీస్​ ప్రతీక్​ జలాన్​లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

దిల్లీ లేబర్​ యూనియన్ తరఫున పిటిషన్​ను అడ్వకేట్​ రాజీవ్​ అగర్వాల్ దిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. 'అన్ని తరగతుల మహిళా ఉద్యోగులు, సిబ్బంది, రోజూవారీ కూలీలు, ఒప్పంద ఉద్యోగులకు నెలకు నాలుగు రోజులు వేతనంతో కూడిన రుతుక్రమం సెలవులు ఇవ్వాలని, ఒకవేళ మహిళలు పీరియడ్స్​ సమయంలోనూ విధులు నిర్వహిస్తే వారికి అదనపు వేతనం అందించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. అంతేకాక రుతుక్రమం సమయంలో మహిళలకు టాయిలెట్స్​, విశ్రాంతి గదులు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. శానిటరీ ప్యాడ్స్​ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇది మహిళల గౌరవానికి సంబంధించిన అంశమని పిటిషన్​లో వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.