ETV Bharat / bharat

'ఎన్​ఆర్​సీ అమలును ప్రజలు అనుమతించరు' - సీఏఏ

దేశంలో ఎన్​ఆర్​సీ అమలును..ప్రజలు అనుమతించేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉద్ఘాటించారు. నిరసనల్లో మొదట ఎవరు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారో గుర్తించాలన్నారు.

People won't allow NRC implementation: Priyanka Gandhi
ఎన్​ఆర్​సీ అమలును ప్రజలు అనుమతించరు:ప్రియాంక
author img

By

Published : Dec 30, 2019, 8:52 PM IST

జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ)ను దేశంలో అమలు చేయనివ్వబోమని, ప్రజలు అందుకు అనుమతించరంటూ ఉద్ఘాటించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనల్లో విధ్వంసానికి పాల్పడిన వారిపై.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రియాంక ప్రస్తావించారు. మొదట ఎవరు హింసకు పాల్పడుతున్నారో గుర్తించాలన్నారు. ఎటువంటి దర్యాప్తు లేకుండా యూపీ ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు.

"ఎన్​ఆర్​సీ.. పౌరసత్వాన్ని నిర్ధరించే ధ్రువీకరణ పత్రం కాదు. పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో ఎన్​ఆర్​సీకి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని ఇప్పటికే అమలు చేయనివ్వబోమని చెప్పారు."

ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

కాంగ్రెస్​తో పాటు ఇతర పార్టీలూ ఇదే తరహా ప్రకటనలు చేశాయని, ప్రజలకు ఇష్టం లేకుడా ఎన్​ఆర్​సీని అమలు చేయలేరని ప్రియాంక అన్నారు.

ఇదీ చూడండి: 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీంలో వ్యాజ్యం

Millerpuram (Tamil Nadu), Dec 30 (ANI): This salon in Tamil Nadu's Millerpuram came up with a unique idea to attract voracious readers. The salon has an in-built library with an impressive collection of books. To attract the customers, the owner has decided to give a 30% off for reading a book in the salon.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.