ETV Bharat / bharat

రాజస్థాన్ రగడ​పై తొలిసారి స్పందించిన రాజే - వసుంధర రాజే

రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ​ సంక్షోభానికి.. భాజపాకు సంబంధం లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో లోపాలకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని వెల్లడించారు.

people-of-rajasthan-paying-for-discord-within-cong-vasundhara-raje
రాజస్థాన్ రగడ​పై తొలిసారి స్పందించిన వసుంధర రాజే
author img

By

Published : Jul 18, 2020, 5:05 PM IST

Updated : Jul 18, 2020, 6:13 PM IST

రాజస్థాన్​ రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్​ నేత వసుంధరా రాజే తొలిసారిగా స్పందించారు. కాంగ్రెస్​ పార్టీ లోపాలకు.. ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి.. భాజపాకు సంబంధం లేదని తేల్చిచెప్పారు.

"ఈ వ్యవహారంలో భాజపాను, భాజపా నేతలను మధ్యలోకి తీసుకురావడంలో అసలు అర్థమే లేదు. కాంగ్రెస్​లో లోపాలు, కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి భాజపాపై నిందలు వేస్తున్నారు. రైతుల పంటలపై మిడతలు దాడి చేస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్​ కొరత తీవ్రంగా ఉంది. కాంగ్రెస్​ తప్పులకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు."

-వసుంధరా రాజే, రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి.

ప్రజలే ముఖ్యమని.. వారి సమస్యలను పరిష్కరించడమే ప్రాధాన్యమని వెల్లండించారు రాజే.

ఇదీ చూడండి:- 'భాజపా కుట్రలకు నిదర్శనం రాజస్థాన్​ సంక్షోభం'

సంక్షోభం ఇలా...

గత కొంత కాలంగా కాంగ్రెస్​పై అసంతృప్తితో ఉన్న యువనేత సచిన్​ పైలట్​.. రెబల్​గా మారారు. దీంతో రాజస్థాన్​ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అనంతరం పైలట్​పై వేటు వేసింది కాంగ్రెస్​. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై స్పందించిన పైలట్​.. నిజాన్ని వక్రీకరించగలరు కానీ, ఓడించలేరని పేర్కొన్నారు. తాను భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-

Last Updated : Jul 18, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.